అవినీతి విభాగం బాధ్యతలు అప్పగించండి

రోజులో ఎనిమిది నిమిషాలుండే విధుల కోసం తనకు ఏడాదికి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారని ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా తెలిపారు.

Published : 26 Jan 2023 05:06 IST

 హరియాణా ప్రభుత్వానికి ఐఏఎస్‌ అధికారి ఖేమ్కా లేఖ

చండీగఢ్‌: రోజులో ఎనిమిది నిమిషాలుండే విధుల కోసం తనకు ఏడాదికి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారని ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా తెలిపారు. అవినీతిని నిర్మూలించేందుకు తనకు రాష్ట్ర నిఘా (స్టేట్‌ విజిలెన్స్‌) విభాగం అధిపతిగా బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ మేరకు ఈ నెల 23న ఆయన హరియాణా ప్రభుత్వానికి లేఖ రాశారు. హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ప్రాచీన భాండాగారం (ఆర్కైవ్స్‌) శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ‘నన్ను జనవరి 9న ఆర్కైవ్స్‌ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విభాగం వార్షిక బడ్జెట్‌ రూ.4 కోట్లు. నాకు సంవత్సరానికి అందుతున్న జీతం రూ.40 లక్షలు. ఇక్కడ వారానికి గంటకు మించి పనిలేదు. అవినీతిని చూసినప్పుడు.. నా మనసు తల్లడిల్లుతుంది. కెరీర్‌ చివరి దశలో ఉన్న నేను ఈ విభాగంలో సేవలు అందించాలనుకుంటున్నాను’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు