అనాథ శవాలకు ఆత్మీయురాలు.. మానవత్వాన్ని చాటుకుంటున్న యువతి

పంజాబ్‌కు చెందిన ఓ యువతి ఎవరూ చేయని విధంగా 100కు పైగా అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Updated : 26 Jan 2023 08:10 IST

పంజాబ్‌కు చెందిన ఓ యువతి ఎవరూ చేయని విధంగా 100కు పైగా అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. లూథియానాకు చెందిన పూనమ్‌ పఠానీ పంజాబీ కుటుంబంలో జన్మించారు. 2019లో జరిగిన ఓ ప్రమాదంలో ఆమె కాలు ఛిన్నాభిన్నమైంది. మూడు నాలుగు సర్జరీల తర్వాతా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రతిరోజూ వ్యాయామం చేసి క్రమంగా నిలబడటం ప్రారంభించారు.

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో ఆమె స్నేహితురాలి తండ్రి మరణిస్తే ఆయనకు నివాళులర్పించేందుకు శ్మశానానికి వెళ్లారు. అక్కడ పదుల సంఖ్యలో ఉన్న అనాథ మృతదేహాలను చూసి చలించిపోయారు. వాటికి ఆమె సొంత డబ్బుతో దహన కార్యక్రమాలను పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా 3 నుంచి 4 అనాథ శవాలకు అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని