కారు పార్కింగ్‌ చేస్తుండగా 8 ఏళ్ల చిన్నారి మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ఢీకొట్టగా 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కోయంబత్తూరు జిల్లాలోని వన్నారపేటలో ఈ నెల 18న జరిగింది.

Published : 26 Jan 2023 05:06 IST

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ఢీకొట్టగా 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కోయంబత్తూరు జిల్లాలోని వన్నారపేటలో ఈ నెల 18న జరిగింది. సయ్యద్‌ మహ్మద్‌ ఇటీవలే కొత్త కారు కొని తన ఇంటి వద్ద దాన్ని పార్కింగ్‌ చేస్తున్నాడు. అప్పుడే రైఫుద్దీన్‌ బషీద్‌ అనే బాలుడు అటుగా సైకిల్‌పై వెళ్తున్నాడు. దీంతో కారు యజమాని.. బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను తొక్కాడు. దీంతో ఆ చిన్నారి.. కారు, ఎదురుగా ఉన్న గోడ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు యజమాని సయ్యద్‌ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు