సుష్మపై పాంపియో వ్యాఖ్యల్ని ఖండించిన జైశంకర్‌

భారత మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఉద్దేశించి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కేంద్రమంత్రి ఎస్‌.జైశంకర్‌ ఖండించారు.

Updated : 26 Jan 2023 05:54 IST

దిల్లీ: భారత మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఉద్దేశించి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కేంద్రమంత్రి ఎస్‌.జైశంకర్‌ ఖండించారు. ‘నెవర్‌ గివ్‌ యాన్‌ ఇంచ్‌: ఫైటింగ్‌ ఫర్‌ ది అమెరికా ఐ లవ్‌’ పేరుతో రచించిన తాజా పుస్తకంలో పాంపియో తానెప్పుడూ సుష్మా స్వరాజ్‌ను కీలకమైన వ్యక్తిగా చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అభ్యంతరకర పదజాలం వాడారు. ఆమెను తెలివితక్కువ వ్యక్తిగా అభివర్ణించారు. ప్రస్తుత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్‌ పనితీరును మాత్రం ప్రశంసించారు. స్వరాజ్‌పై తన అభిప్రాయాలతో జైశంకర్‌ కూడా ఏకీభవించారని పుస్తకంలో తెలిపారు. దీనిపై జైశంకర్‌ మండిపడ్డారు. ‘‘సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశిస్తూ పాంపియో రాసిన వాక్యాలను చూశాను. నేను ఎప్పుడూ ఆమెతో ఎంతో గౌరవంగా ఉన్నాను. ఆమెతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమెపై ఉపయోగించిన పదజాలాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని జై శంకర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని