నా భార్య మేజర్‌ కాదు.. పెళ్లయిన నాలుగేళ్లకు కోర్టుకెక్కిన భర్త

పెళ్లి సమయానికి తన భార్య మేజర్‌ కాదంటూ నాలుగేళ్ల తర్వాత గుర్తించిన ఓ భర్త ఆ వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకెళ్లగా.. ఆరేళ్ల తర్వాత కోర్టు పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 26 Jan 2023 13:08 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: పెళ్లి సమయానికి తన భార్య మేజర్‌ కాదంటూ నాలుగేళ్ల తర్వాత గుర్తించిన ఓ భర్త ఆ వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకెళ్లగా.. ఆరేళ్ల తర్వాత పెళ్లి రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీనిపై బాధితురాలు హైకోర్టుకు వెళ్లగా.. ఆ వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తాజాగా స్పష్టం చేసింది. ఆ వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం కొట్టివేసింది.

కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన సుశీల- మంజునాథ్‌ల వివాహం 2012 జూన్‌ 15న జరిగింది. వివాహ సమయానికి తన భార్య వయసు 18 ఏళ్లు నిండలేదని నాలుగేళ్ల తర్వాత మంజునాథ్‌ గుర్తించారు. ఆ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టుకెళ్లడంతో.. ఆయన వినతిని పరిగణనలోకి తీసుకుని విచారించిన న్యాయస్థానం గత ఏడాది ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుశీల హైకోర్టుకెళ్లడంతో.. విచారణ పూర్తి చేసిన జస్టిస్‌ అలోక్‌ ఆరాధె, జస్టిస్‌ విశ్వజిత్‌ల పీఠం ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఇన్నేళ్లు కాపురం చేశాక అప్పటికి మైనర్‌ అనే కారణంగా పెళ్లిని రద్దు చేయలేమని తేల్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు