కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మాజీ ఎమ్మెల్యే

కుమారుడు చనిపోవడంతో కోడలికి మళ్లీ పెళ్లి చేసి ఆమెకో తోడును చూపించారు ఓ మామగారు. తన కోడలికి తండ్రిలా మారిన మామ మాజీ ఎమ్మెల్యే కావడంతో ఈ వివాహం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 26 Jan 2023 07:15 IST

కటక్‌, న్యూస్‌టుడే: కుమారుడు చనిపోవడంతో కోడలికి మళ్లీ పెళ్లి చేసి ఆమెకో తోడును చూపించారు ఓ మామగారు. తన కోడలికి తండ్రిలా మారిన మామ మాజీ ఎమ్మెల్యే కావడంతో ఈ వివాహం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒడిశాలోని ఢెంకనాల్‌ జిల్లాలో గందియ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నవీన్‌ నంద పెద్ద కుమారుడు సంబిత్‌ పెళ్లయిన కొద్ది రోజులకే ప్రమాదంలో చనిపోయారు. సంబిత్‌ మృతి చెందాక ఆయన భార్య అత్తింట్లోనే ఉంటోంది. కోడలి ఒంటరి తనాన్ని చూసి తట్టుకోలేకపోయిన నవీన్‌ నంద ఆమెకు మరో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో కోడలికి, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మంగళవారం భువనేశ్వర్‌లోని నయాపల్లి లక్ష్మీ ఆలయంలో ఆమెకు వివాహం చేశారు. పెళ్లి చిత్రాలను నవీన్‌ నంద సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. ‘నేను తప్పు చేశానో, మంచి చేశానో నాకు తెలియదు. నా పెద్ద కుమారుడు చనిపోయాడు. అతని భార్య మాతోనే ఉంది. ఆమెకు ఒక తోడు అవసరం అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని వ్యాఖ్యలు జోడించారు. ‘కోడలిగా మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు కుమార్తె అయింది’ అని ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు