శ్రీశ్రీ రవిశంకర్‌ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా దిగింది. తిరుప్పూరు జిల్లా కాంగేయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి బుధవారం ఉదయం ఆయన బయలుదేరారు.

Published : 26 Jan 2023 06:39 IST

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా దిగింది. తిరుప్పూరు జిల్లా కాంగేయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి బుధవారం ఉదయం ఆయన బయలుదేరారు. హెలికాప్టర్‌ ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం పులుల అభయారణ్యం ప్రాంతంలో వెళుతుండగా వాతావరణం అనుకూలించలేదు. హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించేందుకు పైలట్ యత్నించారు. ఎట్టకేలకు కడంబూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్గినియం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో దించారు. వాతావరణం అనుకూలించాక హెలికాప్టర్‌ బయలుదేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు