భారత్‌ పర్వ్‌ మినీ ఇండియాకు ప్రతిబింబం

వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వివిధ రకాల వంటకాలను చూస్తుంటే యావద్భారతాన్ని ఒకే చోట చూసినట్లనిపిస్తోందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 27 Jan 2023 04:23 IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ : వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వివిధ రకాల వంటకాలను చూస్తుంటే యావద్భారతాన్ని ఒకే చోట చూసినట్లనిపిస్తోందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎర్రకోట వద్ద భారత్‌ పర్వ్‌ కార్యక్రమాన్ని ఢంకా మోగించి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత్‌ పర్వ్‌ కార్యక్రమం ‘మినీ ఇండియా’ను తలపిస్తోందన్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయామన్నారు. భారత పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్నివ్వడమే భారత్‌పర్వ్‌ ఉద్దేశమన్నారు. గణతంత్ర కవాతులో ప్రదర్శించిన శకటాలను భారత్‌పర్వ్‌లో ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. నంతరం మంత్రి వివిధ రాష్ట్రాల ఫుడ్‌ కోర్టులను సందర్శించారు. మంత్రి ఆంధ్రప్రదేశ్‌ స్టాల్‌ వద్ద ఆగి మిర్చిబజ్జీ తిన్నారు. ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు చేశారు. తెలంగాణ స్టాల్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో నిర్వాహకులతో కాసేపు మాట్లాడి ముందుకు సాగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు