ఒమిక్రాన్ జన్యువులను గుర్తించే పరీక్ష
కరోనా వైరస్‌లో కొత్త రూపాలను 100 శాతం గుర్తించే సరికొత్త పరీక్షా విధానాన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ రూపొందించింది.
ఈనాడు, బెంగళూరు: కరోనా వైరస్‌లో కొత్త రూపాలను 100 శాతం గుర్తించే సరికొత్త పరీక్షా విధానాన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ రూపొందించింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్ (సీ-క్యాంప్) ఉద్దీపన సంస్థ క్రిస్పర్‌బిట్స్ రూపొందించిన ఒమిక్రిస్ప్ పరీక్ష ద్వారా ఆర్‌టీపీసీఆర్ నుంచి తప్పించుకోగలిగే కొత్త జన్యు రకాలను స్పష్టంగా గుర్తించే వీలుందని ఆ సంస్థ ప్రకటించింది. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ- క్రిస్పర్‌ను వినియోగించి ఈ పరీక్షలు చేపడతారు. సెంట్రల్ డిపార్టుమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ ఇండిజీనైజేషన్ ఆఫ్ డయాగ్నస్టిక్స్ కార్యక్రమంలో (ఇండెక్స్) భాగంగా ఇన్‌స్టెమ్, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్‌లు సంయుక్తంగా ఈ పరీక్ష విధానాన్ని రూపొందించాయి. ఈ పరీక్ష ద్వారా 100 శాతం కచ్చితమైన నివేదికలు సాధ్యమని క్రిస్పర్‌బిట్స్ సంస్థ ప్రకటించింది. అన్ని రకాల వైరస్ జన్యు క్రమాలను గుర్తించే ఈ విధానం భారత్ వంటి దేశాల ప్రజా ఆరోగ్య వ్యవస్థకు అనువైనదని సి-క్యాంప్ సీఈఓ తస్లిమారిఫ్ సయ్యద్ పేర్కొన్నారు. కరోనా పరీక్షల్లో ఆర్‌టీపీసీఆర్ కంటే విశ్వసనీయమైన పరీక్ష విధానం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్‌జీఎస్). జన సాంద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో వేగంగా విస్తరించే కొత్త వైరస్‌సు నియంత్రించేందుకు ఎన్‌జీఎస్ విధానం ఖర్చుతో కూడుకున్నది. ఇందుకు ఒమిక్రిస్ప్.. అనుకూలమైన పరీక్ష విధానమని క్రిస్పర్‌బిట్స్ సీఈవో సునీల్ అరోరా తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Covid Tests: శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు
-
Politics News
అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!
-
Ap-top-news News
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన