బిహార్‌లో 70 మందిని కరిచిన వీధికుక్క

బిహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. బుధవారం ఒక్క రోజే 70 మందిని కరిచి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

Published : 27 Jan 2023 04:16 IST

ఆర: బిహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. బుధవారం ఒక్క రోజే 70 మందిని కరిచి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. బాధితులంతా శివగంజ్‌, షిట్ల తోలా, మహాదేవ్‌ రోడ్‌, సదార్‌ ప్రాంతాలకు చెందినవారని గురువారం పోలీసులు వెల్లడించారు. వారందరికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కుక్కను పట్టుకునేందుకు పోలీసులు, పౌరులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు