నటి పరిణీతి చోప్రా, ఆప్‌ నేత రాఘవ్‌ చద్దాలకు బ్రిటన్‌లో అత్యుత్తమ సాధకుల అవార్డులు

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్దా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా, భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌కీపర్‌ అదితి చౌహాన్‌ తదితరులకు ఇండియా - యూకే అత్యుత్తమ సాధకులుగా గౌరవ పురస్కారాలు దక్కాయి.

Published : 27 Jan 2023 04:16 IST

లండన్‌: బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్దా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా, భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌కీపర్‌ అదితి చౌహాన్‌ తదితరులకు ఇండియా - యూకే అత్యుత్తమ సాధకులుగా గౌరవ పురస్కారాలు దక్కాయి. బుధవారం రాత్రి లండన్‌లో జరిగిన ఓ వేడుకలో ఈ అవార్డులు అందజేశారు. బ్రిటీష్‌ విశ్వవిద్యాలయాల్లో చదివిన భారతీయ విద్యార్థుల విజయాలకు గుర్తుగా పూర్వ విద్యార్థులతో ఈ సంయుక్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెయ్యి దరఖాస్తులను నిపుణుల జ్యూరీ పరిశీలించి వీరిని ఎంపిక చేసింది. గతేడాది 1.20 లక్షల భారతీయ విద్యార్థులు బ్రిటన్‌లో విద్యాభ్యాసానికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని