మమతా బెనర్జీ సమక్షంలో.. బెంగాల్‌ గవర్నర్‌ అక్షరాభ్యాసం

సరస్వతీ పూజను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద్‌ బోస్‌కు గురువారం అక్షరాభ్యాసం జరిగింది.

Published : 27 Jan 2023 04:16 IST

తొలి అక్షరం నేర్పించిన 9 ఏళ్ల బాలిక

కోల్‌కతా: సరస్వతీ పూజను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద్‌ బోస్‌కు గురువారం అక్షరాభ్యాసం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో రాజ్‌భవన్‌ వేదికగా నిర్వహించిన ఈ క్రతువులో.. దియాంగ్షీ రాయ్‌ అనే తొమ్మిదేళ్ల బాలిక (మూడో తరగతి) బెంగాలీ అక్షరమాలలోని తొలి అక్షరాన్ని ఎలా రాయాలో బోస్‌కు నేర్పించింది. నాలుగో తరగతి చదువుతున్న మరో ఇద్దరు చిన్నారులు ఆయనకు.. ‘మా’ (అమ్మ), ‘భూమి’ (పుడమి) అనే బెంగాలీ పదాల అర్థాలను తెలియజేశారు. గురుదక్షిణ కింద ఆ ముగ్గురు పిల్లలకు బోస్‌ ఒక్కొక్కరికీ ఒక వెండి నాణెంతో పాటు డ్రాయింగ్‌ పుస్తకాల సంచిని అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని