జామియా విద్యార్థుల విడుదల

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ప్రయత్నించినవారిలో 13 మంది విద్యార్థులు గురువారం సాయంత్రం పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు.

Published : 27 Jan 2023 04:16 IST

వారి విషయంలో తొలుత ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
తిరువనంతపురంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

దిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ప్రయత్నించినవారిలో 13 మంది విద్యార్థులు గురువారం సాయంత్రం పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. గణతంత్ర వేడుకల సందడి అంతా ముగిశాక వారిని విడుదల చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గోధ్రా అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ లింకుల్ని బ్లాక్‌ చేయాలని సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం జేఎన్‌యూలో దీనిని ప్రదర్శించాలనే ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసినప్పుడు నిర్బంధంలో తీసుకున్నవారిలో చాలామందిని సాయంత్రానికే వదిలేసినా 13 మంది మాత్రం పోలీసుల వద్దే ఉన్నారని ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో వారి విడుదలను పోలీసులు ధ్రువీకరించారు. మరోవైపు- కేరళ పీసీసీ గురువారం ఈ డాక్యుమెంటరీని తిరువనంతపురం బీచ్‌ వద్ద ప్రదర్శించింది. అంతకుముందు దీనిని పీసీసీ కార్యాలయంలోనూ కార్యకర్తలు వీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు