Flight: అసహనంతో ‘విమానం హైజాక్‌’ అంటూ ట్వీట్‌

విమానం ఆలస్యం అయిందని అసహనానికి గురై ‘విమానం హైజాక్‌’ అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ అతడ్ని కటకటాలపాలు చేసింది.

Updated : 27 Jan 2023 09:31 IST

కటకటాలపాలైన ఓ ప్రయాణికుడు

దిల్లీ: విమానం ఆలస్యం అయిందని అసహనానికి గురై ‘విమానం హైజాక్‌’ అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ అతడ్ని కటకటాలపాలు చేసింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి జైపుర్‌ వస్తున్న విమానంలో రాజస్థాన్‌కు చెందిన మోతీ సింగ్‌ రాథోడ్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. జైపుర్‌లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ విమానాన్ని దిల్లీకి మళ్లించారు. ఇక్కడకి 9:45కు చేరుకున్న విమానం 1:40కి జైపుర్‌కు బయలుదేరింది. ఈ మధ్యలో అసహనానికి గురైన మోతీసింగ్‌ ‘విమానం హైజాక్‌’ అని ట్వీట్‌ చేశాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని లగేజీతో సహా కిందకి దించేసి పోలీసులకు అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు