జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర
మోముపై చెరగని దరహాసం...గుండె నిండా చెదరని సాహసం..విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి నిలిచే వ్యక్తిత్వం అతని సొంతం.
శ్రీనగర్: మోముపై చెరగని దరహాసం...గుండె నిండా చెదరని సాహసం..విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి నిలిచే వ్యక్తిత్వం అతని సొంతం. మాతృభూమి రక్షణలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేంత త్యాగం!! ఉగ్రవాదంపై పోరులో అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రదర్శించి ముష్కరుల బృందాన్ని మట్టుబెట్టిన జమ్మూకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ మదాసిర్ అహ్మద్ షేక్.. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కేంద్ర ప్రభుత్వం ఆ అమరవీరుడికి బుధవారం ‘శౌర్య చక్ర’ను ప్రకటించింది. ధైర్యసాహసాలకు గుర్తింపుగా శాంతి సమయంలో ప్రదానం చేసే మూడో అత్యున్నత పురస్కారమిది.
బారాముల్లాలోని యురికి చెందిన కానిస్టేబుల్ షేక్ అలియాస్ బిందాస్.. కరడుగట్టిన ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను హతమార్చడంలో అత్యంత క్రియాశీల పాత్ర నిర్వహించారు. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు గత ఏడాది మే 25న సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఒక చెక్‌పోస్టు వద్ద పోలీసులను గమనించిన ఉగ్రవాదులు కారులో ప్రయాణిస్తూనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ప్రతిగా కాల్పులు ప్రారంభించాయి. ఆ సమయంలో కానిస్టేబుల్ అహ్మద్ షేక్ అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ముగ్గురు ముష్కరులను హతమార్చే క్రమంలో తన ప్రాణాలను త్యాగం చేశారు. అధికరణం 370 రద్దు తర్వాత తొలిసారి గత ఏడాది అక్టోబరు 5న జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా... కానిస్టేబుల్ అహ్మద్ షేక్ కుటుంబ సభ్యులను కలిశారు. అమరవీరుడి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అహ్మద్ షేక్ అపూర్వ వ్యక్తిత్వం ముందు ఏదీ సాటిరాదని జమ్మూకశ్మీర్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TRT: టీఆర్టీ సిలబస్‌లో స్వల్ప మార్పు
-
Hyderabad: సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు సహా ముగ్గురు పోలీసులపై కేసు
-
Vandebharat Express: మరింత సౌకర్యంగా వందేభారత్ ప్రయాణం
-
Chandrababu Arrest: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండు
-
హిజాబ్‌ను కాదంటే పదేళ్ల జైలుశిక్ష
-
భారతీయ శాస్త్రవేత్త స్వాతికి బోర్లాగ్ అవార్డు