కాస్త ఓపిక పట్టండి.. హామీలన్నీ నెరవేరుస్తాం: కేజ్రీవాల్‌

కొద్దిగా ఓపిక పట్టండి రాబోయే అయిదేళ్లలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సీఎం భగవంత్‌ మాన్‌తో కలిసి పంజాబ్‌లో మరో 400 మొహల్లా చికిత్సాలయాలను కేజ్రీవాల్‌ ప్రారంభించారు.

Published : 28 Jan 2023 08:21 IST

పంజాబ్‌లో 400 మొహల్లా క్లీనిక్‌లు ప్రారంభం
తెలంగాణ సీఎం మమ్మల్ని చూసి దవాఖానాలు పెట్టారు: భగవంత్‌ మాన్‌

అమృత్‌సర్‌: కొద్దిగా ఓపిక పట్టండి రాబోయే అయిదేళ్లలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సీఎం భగవంత్‌ మాన్‌తో కలిసి పంజాబ్‌లో మరో 400 మొహల్లా చికిత్సాలయాలను కేజ్రీవాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘కేవలం 10 నెలల్లోనే 500 మొహల్లా క్లీనిక్‌లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. వీటి ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పంజాబ్‌ వ్యవస్థను 70ఏళ్లలో పాలకులు నాశనం చేశారు. కొద్దిగా ఓపిక పట్టండి.. ఇచ్చిన హామీలన్ని రాబోయే అయిదేళ్లలో నెరవేరుస్తాం’’  అని అన్నారు.

మేం విద్య, వైద్యం గురించే మాట్లాడతాం.. ద్వేషం గురించి కాదు!

సీఎం భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. ‘‘దిల్లీలోని మొహల్లా క్లీనిక్‌లను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సీఎం అక్కడ బస్తీ దావాఖానాలు పెట్టారు. తమిళనాడు సీఎం దిల్లీ తరహాలో అక్కడ పాఠశాలలు  నిర్మిస్తున్నారు. తాము విద్య, వైద్యం, పరిశ్రమల గురించే మాట్లాడుతున్నాం. ద్వేషం గురించి కాదు’’ అని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు