భూవివాదంపై అమర్త్యసేన్‌కు మళ్లీ విశ్వభారతి లేఖ

నిజం ఏంటో, అబద్ధం ఏంటో గ్రహించలేని వ్యక్తి వైస్‌ ఛాన్సలర్‌ బాధ్యతల్లో ఉండటం బాధాకరమని విశ్వభారతి విశ్వవిద్యాలయ ఉపకులపతిని ఉద్దేశించి అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు.

Published : 28 Jan 2023 05:04 IST

కోల్‌కతా: నిజం ఏంటో, అబద్ధం ఏంటో గ్రహించలేని వ్యక్తి వైస్‌ ఛాన్సలర్‌ బాధ్యతల్లో ఉండటం బాధాకరమని విశ్వభారతి విశ్వవిద్యాలయ ఉపకులపతిని ఉద్దేశించి అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు. వర్సిటీలో ఆక్రమించిన భూమిని తక్షణమే అప్పజెప్పాలని నోబెల్‌ గ్రహీత సేన్‌కు వర్సిటీ శుక్రవారం మరోసారి లేఖ రాసింది. ‘‘మీరు నివాసం ఉంటున్న భూమి విస్తీర్ణం 1.38 ఎకరాలు. చట్టపరంగా మీ భూమి 1.25 ఎకరాలు మాత్రమే. ఆక్రమించిన భూమిని తక్షణమే తిరిగి ఇచ్చేయండి లేదా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని లేఖలో తెలిపింది. దీనిపై స్పందించిన ఆర్థికవేత్త.. ‘‘ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటూ పోతుంటే అది కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఏం సాధిస్తాం. నిజానికీ అబద్ధానికీ తేడాను గ్రహించలేని వ్యక్తి ఉపకులపతి హోదాలో ఉండటం బాధాకరం. ఆయనతో నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. మూడురోజుల వ్యవధిలోనే భూవివాదంపై సేన్‌కు ఇలా లేఖ రాయడం ఇది రెండోసారి. ఇప్పటికే మొదటి లేఖకు స్పందిస్తూ.. మీ వైఖరి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అమర్త్యసేన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని