రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు తీసుకువచ్చిన ఈ దున్న రైతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Updated : 29 Jan 2023 09:29 IST

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు తీసుకువచ్చిన ఈ దున్న రైతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్‌ అనే రైతుకు చెందిన దీని పేరు గజేంద్ర. పంజాబ్‌ రైతులు ఈ దున్నను రూ.1.5 కోట్లకు కొనేందుకు ముందుకు వచ్చినా యజమాని ససేమిరా అంటున్నారు. 1,500 కిలోల బరువున్న ఇది రోజుకు 15 లీటర్ల పాలు తాగడంతోపాటు రెండు కిలోల పిండి, మూడు కిలోల గడ్డి తింటుంది. ఈ తరహా దున్నలు తమ దగ్గర అయిదు ఉన్నాయని బెళగావి రైతు తెలిపారు. కుటుంబసభ్యుల్లా చూసుకొంటున్న వీటిని  ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మేది లేదని రెడ్యాచే చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని