హిమగిరుల్లో అద్దాల ఇగ్లూలు

చుట్టూ మంచు.. భారీగా హిమపాతం. వెచ్చటి అద్దాలగదిలో కూర్చొని ఆ అందాలను ఆస్వాదించడమంటే ఏదో ఫాంటసీలా ఉంటుంది కదూ! జమ్మూకశ్మీర్‌లోని ఓ రెస్టారెంటు పర్యాటకులకు ఈ అనుభూతిని నిజం చేస్తోంది. గుల్మార్గ్‌లో ఉన్న గ్రీన్‌ హైట్స్‌ రెస్టారెంటు వినూత్నంగా అద్దాల ఇగ్లూలను ఏర్పాటు చేసింది.

Published : 29 Jan 2023 03:28 IST

చుట్టూ మంచు.. భారీగా హిమపాతం. వెచ్చటి అద్దాలగదిలో కూర్చొని ఆ అందాలను ఆస్వాదించడమంటే ఏదో ఫాంటసీలా ఉంటుంది కదూ! జమ్మూకశ్మీర్‌లోని ఓ రెస్టారెంటు పర్యాటకులకు ఈ అనుభూతిని నిజం చేస్తోంది. గుల్మార్గ్‌లో ఉన్న గ్రీన్‌ హైట్స్‌ రెస్టారెంటు వినూత్నంగా అద్దాల ఇగ్లూలను ఏర్పాటు చేసింది. గతంలో మంచుతో ఇగ్లూలను నిర్మించి ఆకట్టుకున్న నిర్వాహకులు.. తాజాగా అద్దాలగది లోపలి నుంచి మంచు అందాలు ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకొన్న ఫ్యాబ్రికేటెడ్‌ గ్లాస్‌తో ఇగ్లూలను నిర్మించినట్లు రెస్టారెంటు మేనేజర్‌ హమీద్‌ మసూది తెలిపారు.  ఒక్కో ఇగ్లూలో గరిష్ఠంగా 8 మంది కూర్చోవచ్చని తెలిపారు. ఈ అద్దాల ఇగ్లూలో గడపడానికి 40 నిమిషాలకు రూ.2 వేలు.. ఆహారానికి అదనంగా బిల్లు వసూలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు