జీన్స్‌ దుస్తులతో న్యాయవాది.. బయటకు పంపిన న్యాయమూర్తి

అస్సాంలోని గువాహటి హైకోర్టులో ఓ సీనియర్‌ న్యాయవాదికి ఊహించని అనుభవం ఎదురైంది.

Updated : 29 Jan 2023 06:10 IST

దిస్‌పుర్‌: అస్సాంలోని గువాహటి హైకోర్టులో ఓ సీనియర్‌ న్యాయవాదికి ఊహించని అనుభవం ఎదురైంది. జీన్స్‌ దుస్తులు ధరించి ఓ కేసు విచారణకు ఆయన హాజరుకాగా.. న్యాయమూర్తి కోర్టు నుంచి బయటకు పంపించారు. ఓ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీకే మహాజన్‌ జీన్స్‌ దుస్తులు ధరించి తన వాదనలు వినిపించేందుకు కోర్టుకు వచ్చారు. ఆయన వస్త్రధారణను గమనించిన జస్టిస్‌ కల్యాణ్‌రాయ్‌ సురానా ఆధ్వర్యంలోని ధర్మాసనం వెంటనే పోలీసులను పిలిచి, న్యాయవాదిని కోర్టు నుంచి బయటకు పంపాలని ఆదేశించింది. ఇదే కారణంగా విచారణను వారం వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ సురానా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు