కొలీజియం నిర్ణయం సర్కారుకు శిరోధార్యం
కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ గట్టిగా ఖండించారు.
పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్
ముంబయి: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ గట్టిగా ఖండించారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను ఖరారు చేయకుండా కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి పెను ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ముంబయి వర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్ నారిమన్ ప్రసంగించారు. కొలీజియం పంపిన న్యాయమూర్తుల జాబితాపై కేంద్రం 30 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే, ఇక ప్రభుత్వానికి చెప్పడానికి ఏమీ లేదని భావించాలనీ, ఈ మేరకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తీర్పు వెలువరించాలని ఆయన సూచించారు. స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించే న్యాయమూర్తులను నియమించకపోతే స్వతంత్ర న్యాయవ్యవస్థ ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. అటువంటి న్యాయ వ్యవస్థ లేకుంటే దేశం కొత్త చీకటి యుగంలోకి ప్రవేశిస్తుందని ఆయన హెచ్చరించారు. కొలీజియం పద్ధతిని విమర్శిస్తున్న కేంద్ర మంత్రి రిజిజు రాజ్యాంగ మౌలికాంశాలను తెలుసుకోవాలన్నారు. 1990ల వరకు భారత రాష్ట్రపతి... సీజేఐని సంప్రదించి న్యాయమూర్తులను నియమించే పద్ధతి ఉండేది. ప్రధానంగా సీజేఐ సలహా ప్రకారమే నియామకాలు జరిగేవని నారిమన్ వివరించారు. తరవాత ప్రధాన న్యాయమూర్తితో పాటు సీనియర్ న్యాయమూర్తులను కూడా సంప్రదించే పద్ధతి వచ్చిందని చెప్పారు. భారత్‌లో రాజ్యాంగానికి భాష్యం చెప్పే బాధ్యతను కనీసం అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్వహిస్తుందని గుర్తుచేశారు. ఈ ధర్మాసనం నిర్ణయాన్ని ప్రభుత్వం శిరసావహించాలని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె