రాజస్థాన్‌లో కవల సోదరుల.. జేఈఈ-మెయిన్స్‌ హాల్‌టికెట్ల నిలిపివేత

రూపంలో ఇద్దరూ భిన్నంగా ఉన్నప్పటికీ కవల సోదరులైన కారణంగా రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన ఆదిత్యశర్మ, అనురాగ్‌శర్మ అనే విద్యార్థులు 25వ తేదీన జరిగిన జేఈఈ-మెయిన్స్‌ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

Published : 29 Jan 2023 04:22 IST

కోటా (రాజస్థాన్‌): రూపంలో ఇద్దరూ భిన్నంగా ఉన్నప్పటికీ కవల సోదరులైన కారణంగా రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన ఆదిత్యశర్మ, అనురాగ్‌శర్మ అనే విద్యార్థులు 25వ తేదీన జరిగిన జేఈఈ-మెయిన్స్‌ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పరీక్ష కోసం వీరిద్దరూ సమర్పించిన ఆధారాలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) హాల్‌టికెట్లను నిలిపివేసింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన విద్యార్థుల తండ్రి జిగ్నేశ్‌శర్మ శనివారం ఈ విషయమై మాట్లాడుతూ.. కవల సోదరులుగా ఇద్దరికీ తగిన నిర్ధారణలు ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో అడ్మిట్‌ కార్డులను రద్దు చేయడంతో ఏడాది శ్రమ వృథా అయిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎన్‌టీఏ ఇలా చెలగాటం ఆడటం తగదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని