మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే.. వేలమంది భర్తలకు శిక్ష తప్పదు: అస్సాం సీఎం హెచ్చరిక

మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.

Updated : 29 Jan 2023 07:40 IST

గువాహటి: మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని శనివారం గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టంచేశారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మాయిలకు వివాహ వయసు 18 ఏళ్లు. అంతకంటే తక్కువ వయసున్న వారిని పెళ్లిచేసుకున్నవారు యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లి అయ్యేందుకు మహిళలు మరీ ఎక్కువ వయసు వరకు వేచి ఉండకూడదు. మాతృత్వం పొందడానికి 22 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు అనువైనది. ప్రతీ దానికి తగిన వయసు ఉండేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడు’’ అని సీఎం చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని