‘ఉద్యాన్‌ ఉత్సవ్‌’ను ప్రారంభించిన రాష్ట్రపతి

అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొగల్‌ గార్డెన్స్‌తోపాటు రాష్ట్రపతి భవన్‌లోని ఇతర ఉద్యానాలను ప్రజలు సందర్శించేందుకు వీలుగా ‘అమృత్‌ ఉద్యాన్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ప్రారంభించారు.

Published : 30 Jan 2023 04:12 IST

31 నుంచి సందర్శకులకు అనుమతి

దిల్లీ: అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొగల్‌ గార్డెన్స్‌తోపాటు రాష్ట్రపతి భవన్‌లోని ఇతర ఉద్యానాలను ప్రజలు సందర్శించేందుకు వీలుగా ‘అమృత్‌ ఉద్యాన్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకూ ఉదయం 10నుంచి 4గంటల మధ్య సందర్శకులను అనుమతిస్తారు. మార్చి 28న రైతులు, 29న దివ్యాంగులు, 30న రక్షణ, పారామిలిటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి, మార్చి 31న మహిళలు, గిరిజన తెగల స్వయం సహాయక బృందాల సభ్యులకే అనుమతి ఉంటుంది. 12రకాల తులిప్‌ మొక్కలతో కొత్తగా అభివృద్ధి చేసిన తోటనూ సందర్శించేందుకు వీలుంటుందని రాష్ట్రపతి భవన్‌ తెలిపింది.

సందర్శకులు https://rashtrapatisachivalaya.gov.in/ లేదా https://rb.nic.in/rbvisit/visit_plan.aspx/లో ముందుగా స్లాట్‌ను బుక్‌ చేసుకోవాలి. నేరుగా వెళ్లేవారు రాష్ట్రపతి భవన్‌ గేట్‌ నెం:12 ఎదుట ఉన్న కౌంటర్లలో పేర్లను నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://rashtrapatisachivalaya.gov.in/rbtour/ లో సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని