ముస్లిం ఆధ్యాత్మికవేత్తలతో త్వరలో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం

ముస్లిం నేతలతో త్వరలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) భేటీ కానుంది. దేవబండ్‌, బరేలీకి చెందిన ముస్లిం ఆధ్యాత్మికవేత్తలతో వివిధ విషయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యనిర్వాహకులు సమావేశం కానున్నారు.

Published : 30 Jan 2023 04:52 IST

దిల్లీ: ముస్లిం నేతలతో త్వరలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) భేటీ కానుంది. దేవబండ్‌, బరేలీకి చెందిన ముస్లిం ఆధ్యాత్మికవేత్తలతో వివిధ విషయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యనిర్వాహకులు సమావేశం కానున్నారు. భేటీ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంఘ్‌ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ముస్లిం వర్గానికి చెందిన అయిదుగురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో సంఘ్‌-ముస్లిం నాయకుల మధ్య కాశీ, మథుర ఆలయాల సమస్య, విద్వేష ప్రసంగాలు తదితర విషయాలపై చర్చ జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు