విమానం అత్యవసర ద్వారం కవర్‌ తొలగింపు యత్నం

గాలిలో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించేందుకు యత్నించడం కలకలం రేపింది.

Published : 30 Jan 2023 04:52 IST

ముంబయి: గాలిలో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించేందుకు యత్నించడం కలకలం రేపింది. ‘నాగ్‌పుర్‌ నుంచి ముంబయికి వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు.. అత్యవసర ద్వారం కవర్‌ను తొలగించేందుకు యత్నించాడు. ఆ సమయంలో విమానం ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ భద్రతా ఉల్లంఘనను గుర్తించిన సిబ్బంది.. వెంటనే కెప్టెన్‌ను అప్రమత్తం చేశారు. ఈ విషయమై సదరు ప్రయాణికుడిని హెచ్చరించారు’ అని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనధికారికంగా ట్యాంపరింగ్‌ చేసినందుకుగానూ అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని