తూర్పు లద్దాఖ్‌లో వ్యూహాత్మక రహదారి

వాస్తవాధీన రేఖ సమీపంలో చైనాతో సరిహద్దులున్న తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో భారత్‌ సరికొత్త రహదారి నిర్మాణం చేపట్టింది.

Published : 30 Jan 2023 04:50 IST

నిర్మాణ పనులు ప్రారంభం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాస్తవాధీన రేఖ సమీపంలో చైనాతో సరిహద్దులున్న తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో భారత్‌ సరికొత్త రహదారి నిర్మాణం చేపట్టింది. దీని ద్వారా పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలోని చుషూల్‌కు, తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌కు మధ్య అనుసంధానం లభిస్తుంది. ఈ రహదారి పొడవు 135 కిలోమీటర్లు. టిబెట్‌ శరణార్థులు దుంగ్తి ప్రాంతం రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు పనులు రెండేళ్లలో పూర్తికానున్నాయి. సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) దీని నిర్మాణ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా లోమా ప్రాంతంలోని సింధూ నదిపై ఉన్న ఇనుప వంతెనను తొలగించి కాంక్రీట్‌ వంతెన నిర్మించనున్నారు. చైనాతో సరిహద్దు వివాదం చోటుచేసుకున్న ప్రదేశానికి భారీ ట్యాంకులను అలవోకగా దీనిపై నుంచి తరలించే అవకాశం లభిస్తుంది. బ్లాక్‌టాప్‌ సమీపం నుంచి లేహ్‌ను అనుసంధానిస్తూ మూడు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో తాంగ్సె నుంచి లేహ్‌కు వెళ్లే రోడ్డు ఒకటి. ఇది చాంగ్లా పాస్‌ మీదుగా వెళుతుంది. మరో మార్గం న్యోమా నుంచి లేహ్‌కు వెళుతుంది. చుషూల్‌ నుంచి ఉన్న రోడ్డు లోమా వంతెనపై నుంచి వెళుతుంది. ఈ మార్గం తరచు మట్టి లేదా ఇసుకతో నిండిపోతుంది. దాదాపు మట్టిరోడ్డులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. తాజాగా చుషూల్‌-దెమ్‌చోక్‌ మార్గంతో సరిహద్దుల వెంట మౌలికవసతులు బలోపేతం అవుతాయని అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని