Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్‌’!

భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో చేయి కలిపి చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువకుడి పేరు మహమ్మద్‌ ఫైసల్‌ చౌధరి (24).

Published : 30 Jan 2023 08:01 IST

భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో చేయి కలిపి చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువకుడి పేరు మహమ్మద్‌ ఫైసల్‌ చౌధరి (24). ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లా మవానా తహసీల్‌కు చెందిన యువరైతు. దూరం నుంచి చూస్తే రాహుల్‌ పోలికలతో కనిపించే ఫైసల్‌ను స్థానికంగా అందరూ ‘ఛోటా రాహుల్‌గాంధీ’ అని పిలుస్తారు! కాంగ్రెస్‌ అభిమాని అయిన తండ్రి మరణానంతరం బీఏ చదువును సగంలో ఆపి వ్యవసాయం చేపట్టిన ఫైసల్‌.. భారత్‌ జోడో యాత్ర దిల్లీలో ఉండగా రాహుల్‌ బృందంతో జత కలిశారు. అగ్రనేతతో ఒక్క ఫొటో దిగాలన్న ఈ యువకుడి కోరిక జనవరి 12న తీరింది. యాత్రికులతో కలిసి నడుస్తుండగా రాహుల్‌ దృష్టిలో పడటంతో ఫైసల్‌ను  దగ్గరకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు