ఒడిశా మంత్రి నబ కిశోర్‌ దాస్‌కు కన్నీటి వీడ్కోలు

ఒడిశా మంత్రి నబ కిశోర్‌ దాస్‌ అంత్యక్రియలు సోమవారం ఝార్సుగుడలో అధికార లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Published : 31 Jan 2023 03:13 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశా మంత్రి నబ కిశోర్‌ దాస్‌ అంత్యక్రియలు సోమవారం ఝార్సుగుడలో అధికార లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌లో పోస్టుమార్టం చేసిన అనంతరం ఆయన  పార్థివదేహాన్ని అధికార నివాసానికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం గవర్నర్‌ ఆచార్య గణేశీలాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పార్థివదేహాన్ని విమానంలో ఝార్సుగుడ తరలించారు. మంత్రి మృతికి సంతాపంగా ఝార్సుగుడలో వ్యాపార సంస్థలు మూసివేశారు. మధ్యాహ్నం ఖెరువాల్‌ మన్మోహన్‌ మైదానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నబ కిశోర్‌ చితికి ఆయన కుమారుడు విశాల్‌ దాస్‌ నిప్పంటించారు. ప్రభుత్వం మంగళవారం వరకు సంతాపదినాలు ప్రకటించింది. ఆదివారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిని ఏఎస్సై గోపాల్‌ దాస్‌ తుపాకీతో కాల్చి హతమార్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు