9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుకే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడిచే రవాణా, ప్రభుత్వరంగ సంస్థల్లో 15 ఏళ్లకు పైబడి సర్వీసులో ఉన్న తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు ఇక రోడ్లపై తిరగబోవని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

Published : 31 Jan 2023 03:57 IST

కేంద్ర మంత్రి గడ్కరీ

దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడిచే రవాణా, ప్రభుత్వరంగ సంస్థల్లో 15 ఏళ్లకు పైబడి సర్వీసులో ఉన్న తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు ఇక రోడ్లపై తిరగబోవని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. వాటిని తుక్కుగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆ తొమ్మిది లక్షల వాహనాల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలను ప్రవేశపెట్టనున్నామని ప్రకటించారు. ఇథనాల్‌, మిథనాల్‌, బయో సీఎన్‌జీ, బయో ఎల్‌ఎన్‌జీ, విద్యుత్తుతో నడిచే వాహనాల తయారీకి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని గడ్కరీ పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు