ట్రాన్స్‌జెండర్‌తో వివాహం.. యువకుడికి బంధువుల వేధింపులు

లింగమార్పిడి చేయించుకున్న ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న ఓ యువకుడు బంధువుల వేధింపులకు గురవుతున్న ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.

Updated : 31 Jan 2023 07:12 IST

లింగమార్పిడి చేయించుకున్న ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న ఓ యువకుడు బంధువుల వేధింపులకు గురవుతున్న ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. అమృత్‌సర్‌కు చెందిన అర్జున్‌ అనే యువకుడు రవి అనే ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ కలసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రవి ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిగా మారాడు. అనంతరం తన పేరును మీన్‌ రియాగా మార్చుకున్నాడు.

అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరు ఒక పాపను దత్తత తీసుకుని ఆనందంగా గడుపుతున్నారు. వారిని రియా కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆమె బంధువులు కొంతమంది వారి బంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. భోగి పండుగ రోజున కూడా వారు వచ్చి తనను అసభ్యంగా తిట్టడమే కాకుండా కొట్టారని అర్జున్‌ ఆరోపించాడు. ఈ వేధింపులు ఆపకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు