Pathaan: ‘పఠాన్‌’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తాజా చిత్రం పఠాన్‌ను వీక్షించేందుకు ఓ దివ్యాంగుడు సాహసం చేశాడు. సొంత ఊర్లో టికెట్లు దొరకలేదని 150 కిలోమీటర్ల దూరంలోని పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ సినిమా చూశాడు.

Updated : 31 Jan 2023 12:09 IST

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తాజా చిత్రం పఠాన్‌ను వీక్షించేందుకు ఓ దివ్యాంగుడు సాహసం చేశాడు. సొంత ఊర్లో టికెట్లు దొరకలేదని 150 కిలోమీటర్ల దూరంలోని పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ సినిమా చూశాడు. బిహార్‌లోని భాగల్‌పుర్‌కు చెందిన మహమ్మద్‌ రుస్తుమ్‌కు చిన్నప్పటి నుంచి కాళ్లు పనిచేయవు. సొంతంగా నిలబడలేడు. తన అభిమాన నటుడు చిత్రం చూడాలని చాలా ఆరాటపడ్డాడు. భాగల్‌పుర్‌లో టికెట్లు దొరక్కపోయే సరికి.. అతని సోదరుడు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు రుస్తుమ్‌ను తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆదివారం మధ్యాహ్నం స్థానిక సంసీర్‌ హాల్‌లో పఠాన్‌ చిత్రాన్ని వీక్షించారు. సినిమా కోసం సోదరులిద్దరూ ఆరు గంటలు ప్రయాణం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని