బతికుండగానే 5వ వర్ధంతి కార్యక్రమం

ఎవరైనా చనిపోయి సంవత్సరం అయ్యాక వర్ధంతి కార్యక్రమాలు జరుపుతుంటారు కుటుంబ సభ్యులు. పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు మాత్రం బతికుండగానే తన 5వ వర్ధంతిని జరుపుకొన్నాడు.

Published : 31 Jan 2023 08:44 IST

ఎవరైనా చనిపోయి సంవత్సరం అయ్యాక వర్ధంతి కార్యక్రమాలు జరుపుతుంటారు కుటుంబ సభ్యులు. పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు మాత్రం బతికుండగానే తన 5వ వర్ధంతిని జరుపుకొన్నాడు. అతడికి కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు. ఫతేగఢ్‌ సాహిబ్‌ జిల్లా మజ్రి సోధియా గ్రామానికి చెందిన భజన్‌ సింగ్‌ వృత్తిరీత్యా ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. ఈ కలియుగంలో సమాజాన్ని అప్రమత్తం చేయడమే తన లక్ష్యమని అతను చెప్పాడు. అందుకే బతికుండగానే ఐదేళ్ల నుంచి వర్ధంతిచేసుకుంటున్నానని తెలిపాడు. ఇందులో భాగంగా ఐదుగురు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశాడు భజన్‌ సింగ్‌. అలాగే 11 మంది బాలికలకు భోజనాలు పెట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు