గోరఖ్‌నాథ్‌ ఆలయంలో దాడి.. నిందితుడు అబ్బాసీకి మరణశిక్ష

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ గోరఖ్‌నాథ్‌ ఆలయంలో కత్తితో బీభత్సం సృష్టించిన ముర్తాజా అబ్బాసీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు సోమవారం దోషిగా తేల్చి అతడికి మరణశిక్ష విధించింది.

Published : 31 Jan 2023 04:49 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ గోరఖ్‌నాథ్‌ ఆలయంలో కత్తితో బీభత్సం సృష్టించిన ముర్తాజా అబ్బాసీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు సోమవారం దోషిగా తేల్చి అతడికి మరణశిక్ష విధించింది. దాదాపు తొమ్మిది నెలల క్రితం గోరఖ్‌పుర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయంలో స్థానికుడైన ముర్తజా.. కత్తితో దాడి చేసి ఇద్దరు జవాన్లను గాయపరిచాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తులో తనకు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అబ్బాసీ అంగీకరించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అతనిని ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అబ్బాసీ.. ఐఐటీ ముంబయి నుంచి 2015లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు