చట్టసవరణలు గత తీర్పులను మార్చలేవు

గతంలో తాము ఇచ్చిన తీర్పులను కాలక్రమంలో చట్టంలో వచ్చే సవరణలు రద్దు చేయలేవని, మార్చలేవని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది.

Published : 31 Jan 2023 04:49 IST

సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ

దిల్లీ: గతంలో తాము ఇచ్చిన తీర్పులను కాలక్రమంలో చట్టంలో వచ్చే సవరణలు రద్దు చేయలేవని, మార్చలేవని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్‌ పదవీకాలానికి సంబంధించి 2021 సెప్టెంబరు 8న ఇచ్చిన తీర్పులో కొన్ని మార్పులు చేయాలని కోరుతూ కేంద్రం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు పైవిధంగా స్పందించింది. ఈడీ డైరెక్టర్‌ పదవీకాల పొడిగింపును ఐదేళ్ల వరకు పెంచుకునేలా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ)చట్టానికి చేసిన సవరణలను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు జయాఠాకుర్‌ వేసిన పిటిషన్‌ విచారణ జరుగుతున్న సమయంలో సొలిసిటర్‌ జనరల్‌ మార్పుల ప్రతిపాదన చేశారు. ఈ పిటిషన్‌ 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దాఖలయిందేనని కోర్టుకు తెలిపారు. తమ ఉత్తర్వులను తర్వాత వచ్చిన చట్ట సవరణలు మార్చలేవని జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించడంతో.. ప్రస్తుతానికి ఈ దరఖాస్తును సదరు పిటిషన్‌తో జత చేయాలని, వాదనలకు కాస్త సమయం ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని