బ్యాంక్‌ మేనేజర్‌ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా..

శీతల్‌ శిందే.. 2014 నుంచి పుణెలోని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజరుగా నాలుగేళ్లు విధులు నిర్వహించిన ఈమె బస్‌ డ్రైవరుగా మారేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Updated : 01 Feb 2023 06:58 IST

శీతల్‌ శిందే.. 2014 నుంచి పుణెలోని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజరుగా నాలుగేళ్లు విధులు నిర్వహించిన ఈమె బస్‌ డ్రైవరుగా మారేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మంచి జీతం.. ఏసీ గదిలో విధులు.. అయినా శీతల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర శిక్షణ పూర్తి కావచ్చింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆర్‌టీసీలో చేరానని ఆమె చెబుతున్నారు. మహారాష్ట్ర ఆర్‌టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికే ఉన్నప్పటికీ, 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. మధ్యలో కరోనాతో విరామం రాగా, చివరకు 17 మంది మహిళలు మిగిలారు. వీరిలో ఒకరైన శీతల్‌ శిందే మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్‌టీసీ తొలి బ్యాచ్‌ మహిళా డ్రైవరుగా విధుల్లో చేరనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు