సిబ్బంది వ్యభిచారానికి పాల్పడితే సాయుధ దళాలు చర్య తీసుకోవచ్చు

వ్యభిచారం నేరం కాదంటూ 2018లో తాము ఇచ్చిన తీర్పునకు కొంత సవరణగా మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. సాయుధ దళాల్లో వ్యభిచారానికి పాల్పడితే సంబంధిత సైనిక అధికారులపై చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది.

Published : 01 Feb 2023 03:52 IST

 2018 నాటి తీర్పుపై   సుప్రీంకోర్టు స్పష్టత

దిల్లీ: వ్యభిచారం నేరం కాదంటూ 2018లో తాము ఇచ్చిన తీర్పునకు కొంత సవరణగా మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. సాయుధ దళాల్లో వ్యభిచారానికి పాల్పడితే సంబంధిత సైనిక అధికారులపై చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. వ్యభిచారంపై గతంలో తాము ఇచ్చిన తీర్పునకు సాయుధ దళాల చట్టంలోని నిబంధనలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. 2018లో ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరమని పేర్కొంటున్న ఐపీసీలోని సెక్షన్‌ 497 రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ తీర్పు నుంచి సాయుధ దళాలకు మినహాయింపు ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబ్బంది ఇటువంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షిస్తే సేనలలో అది అస్థిరతకు దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య తమ కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న సైన్యంలో ఈ తీర్పు గందరగోళానికి దారి తీస్తుందని రక్షణశాఖ తన పిటిషనులో కోర్టు దృష్టికి తెచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు