సిబ్బందిని కొట్టి.. విమానంలో అర్ధనగ్నంగా తిరుగుతూ

విమానంలో ఇటలీ మహిళ ఒకరు అనుచితంగా ప్రవర్తిస్తూ గొడవకు దిగింది. సిబ్బందిపై దాడికి పాల్పడింది.

Updated : 01 Feb 2023 06:36 IST

ఇటలీ మహిళ అనుచిత ప్రవర్తన

ముంబయి: విమానంలో ఇటలీ మహిళ ఒకరు అనుచితంగా ప్రవర్తిస్తూ గొడవకు దిగింది. సిబ్బందిపై దాడికి పాల్పడింది. అనంతరం విమానంలో అర్ధ నగ్నంగా నడిచింది. విస్తారా విమానయాన సంస్థకు చెందిన అబుధాబీ - ముంబయి విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విస్తారా సంస్థ, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలివి.. ఎకానమీ క్లాస్‌ టిక్కెట్‌ తీసుకున్న ఆమె (45) సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విమానం ఎక్కింది. అనంతరం బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై దుర్భాషలాడుతూ దాడికి దిగింది. సిబ్బందిలో ఒకరి ముఖంపై కొట్టి, మరొకరిపై ఉమ్మివేసింది. దీంతో తోటి సిబ్బందికి సాయం అందించేందుకు ఇతర ఉద్యోగులు అక్కడికి చేరుకోగా అర్ధనగ్నంగా అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. ఆ సమయంలో తను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అనుచిత వైఖరిని కొనసాగిస్తుండటంతో కెప్టెన్‌ వార్నింగ్‌ కార్డును జారీ చేశారు. మహిళను నిర్బంధించేందుకు నిర్ణయించారు. అనంతరం నిబంధనల మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విమానం ముంబయి చేరుకోగానే ఆమెను సహార్‌ ఠాణా పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు