సంగీత విద్వాంసురాలు లలిత కన్నుమూత

బాంబే సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు లలిత (84) మంగళవారం కన్నుమూశారు.

Published : 01 Feb 2023 04:06 IST

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: బాంబే సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు లలిత (84) మంగళవారం కన్నుమూశారు. చెన్నైలోని అడయారు కర్పగం గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న ఆమె.. వయోధిక సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.   కర్ణాటక సంగీత విద్వాంసులుగా పేరొందిన లలిత, ఈమె సోదరి సరోజ కొన్ని దశాబ్దాలపాటు దేశ, విదేశాలల్లోని కళాభిమానులను తమ గానంతో రంజింపజేశారు. లలిత.. మాజీ అడ్వకేట్ జనరల్‌ ఎన్‌ఆర్‌చంద్రన్‌ సతీమణి. కేరళలోని త్రిశూర్‌లో ముక్తాంబాల్‌, చిదంబరం అయ్యర్‌ దంపతులకు 1938 ఆగస్టు 6న జన్మించారు. తండ్రి పశ్చిమ రైల్వే ఉద్యోగి కావడంతో ముంబయిలో విద్యాభ్యాసం చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇంటర్‌ పూర్తి చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. కర్ణాటక సంగీతం నేర్చుకుని పలు పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, మ్యూజిక్‌ అకాడమీ నుంచి సంగీత కళానిధి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలైమామణి, శ్రీకృష్ణగాన సభ నుంచి సంగీత చూడామణి, ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నుంచి సంగీత కళాశిఖామణి వంటి పురస్కారాలను అందుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెసెంట్నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు