ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో భారత్‌ ఆంగ్లానికి ప్రాధాన్యం

భారతదేశంలో మాట్లాడే ఆంగ్లభాష తన సత్తా చూపిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ (ఓఈడీ)లో ఉచ్చారణ, ఆడియోకి సంబంధించి భారతీయ ఆంగ్ల భాషకు చెందినవి దాదాపు 800 పదాలు ఉన్నాయి.

Updated : 01 Feb 2023 06:38 IST

దిల్లీ: భారతదేశంలో మాట్లాడే ఆంగ్లభాష తన సత్తా చూపిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ (ఓఈడీ)లో ఉచ్చారణ, ఆడియోకి సంబంధించి భారతీయ ఆంగ్ల భాషకు చెందినవి దాదాపు 800 పదాలు ఉన్నాయి. ఇందులో దేశ్‌, బిందాస్‌, బచ్చా, దియా లాంటి పదాలూ ఉన్నాయి. భారత్‌ రకానికి చెందిన ఇంగ్లిషు.. సవాళ్లతో కూడినప్పటికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఓఈడీ ఉచ్చారణ ఎడిటర్‌ డా.కేథరిన్‌ సాంగ్‌స్టర్‌ అన్నారు. ఆంగ్లంలో ఉచ్చారణ రకాలను విస్తృతపరచడానికి 2016 నుంచి ఓఈడీ కృషి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని