మన్మోహన్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం

భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌(90)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు.

Published : 01 Feb 2023 04:54 IST

లండన్‌: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌(90)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్‌-బ్రిటన్‌ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం(ఎన్‌ఐఎస్‌ఏయూ) త్వరలోనే దిల్లీలో మన్మోహన్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. బ్రిటిష్‌ విశ్వవిద్యాలయాలలో చదివి లబ్ధప్రతిష్ఠులైన భారతీయ విద్యార్థులకు ఇచ్చే అవార్డు ఇది. భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తోందని మన్మోహన్‌ లిఖిత సందేశంలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు