అత్యాచారం కేసులో ఆశారాంకు మరో జీవిత ఖైదు

శిష్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాం బాపూ(81)ని సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జీవితఖైదు, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

Published : 01 Feb 2023 04:54 IST

శిక్షను ప్రకటించిన గుజరాత్‌ కోర్టు

అహ్మదాబాద్‌: శిష్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాం బాపూ(81)ని సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జీవితఖైదు, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షను నిర్ధారించేందుకు మంగళవారం వాదనలు విన్న గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసినందుకు జీవితఖైదు అనుభవిస్తున్న ఆశారాంను నేర స్వభావం ఉన్న వ్యక్తిగా పరిగణించాలని ప్రాసిక్యూషన్‌ వాదించింది. అతడికి జీవితఖైదు విధించాలని విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి డీకే సోనీ.. ఆశారాంకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించారు. దృశ్య మాధ్యమం ద్వారా ఆశారాం విచారణలో పాల్గొన్నారు. ఈ తీర్పును గుజరాత్‌ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు