విద్యార్థులకు చదువే పెద్ద ఆస్తి: స్టాలిన్‌

ఇతరులు అపహరించలేనిది చదువు మాత్రమేనని, ఆ ఆస్తిని విద్యార్థులు కాపాడుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు.

Published : 02 Feb 2023 05:05 IST

వీఐటీ ప్రాంగణంలో కరుణానిధి పేరుతో వసతిగృహం ప్రారంభం

చెన్నై (టీనగర్‌), న్యూస్‌టుడే: ఇతరులు అపహరించలేనిది చదువు మాత్రమేనని, ఆ ఆస్తిని విద్యార్థులు కాపాడుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. వేలూర్‌ వీఐటీ ప్రాంగణంలో ముత్తమిళ్‌ కలైజ్ఞర్‌ కరుణానిధి పేరిట నిర్మించిన విద్యార్థుల వసతిగృహం, పెరల్‌ రీసెర్చి పార్కు ప్రారంభోత్సవాలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. వీఐటీ కులపతి జి.విశ్వనాథన్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం హాజరయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... కలైజ్ఞర్‌ పేరిట రూ.80 కోట్ల వ్యయంతో 379 మంది విద్యార్థుల బసకు వీలుగా నిర్మించిన భవనం, రీసెర్చి పార్కును ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. కులపతిగా ఉన్న విశ్వనాథన్‌.. అన్నాదురై హయాంలోనే డీఎంకే తరఫున విద్యార్థి సంఘాన్ని ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధితో తనకు 50 ఏళ్ల అనుబంధం ఉండేదని కులపతి జి.విశ్వనాథన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, కె.పొన్ముడి తదితరులు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని