Budget 2023: ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై రాయితీలు రూ.5.21 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వం ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న రాయితీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 17% పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బడ్జెట్లో అంచనా వేశారు.

Updated : 02 Feb 2023 13:38 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న రాయితీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 17% పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ రాయితీలు 28% మేర తగ్గి దాదాపు రూ.3.75 లక్షల కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. బడ్జెట్‌ లెక్కల ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై పూర్తి రాయితీలను ప్రభుత్వం రూ.5,21,584.71 కోట్లకు స్థిరీకరించింది. గత ఆర్థిక సంవత్సరం వీటికి కేటాయించిన వాస్తవ బడ్జెట్‌ 4,46,149.24 కోట్లు. ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ఆహారంపై ఇస్తున్న రాయితీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,87,194.05 కోట్లకు స్వల్పంగా తగ్గుతుందని అంచనా కాగా, 2021-22లో ఇది 2,88,968.54 కోట్లు. అలాగే తాజా ఆర్థిక సంవత్సరంలో ఎరువుల రాయితీ 2,24,220.16 కోట్లకు పెరుగుతుండగా.. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1,53,758.10 కోట్లు మాత్రమే. ఇదేవిధంగా పెట్రోలియం రాయితీ సైతం 9,170.50 కోట్లకు పెరుగుతుందని అంచనా కాగా, గత ఆర్థిక సంవత్సరం ఇది కేవలం రూ.3,422.60 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పై మూడు కేటగిరీల మొత్తం రాయితీలు 28% మేర తగ్గుతాయని అంచనా.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని