మరింత ‘రక్షణ’
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. 2023-24 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది.
అగ్నివీరులకు ‘పన్ను’ ఊరట
దిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. 2023-24 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. సైనిక పరికరాల సాంకేతికతలో స్వావలంబనే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. హిమాలయాల్లో మిలిటరీ ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయింపులు పెంచింది. గత ఐదేళ్లలో రక్షణ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో ఈ రంగానికి నిధులను 13 శాతం పెంచింది. ముఖ్యంగా, ఆయుధాల కొనుగోళ్లకు నిధులు పెరిగాయి. దీంతో జలాంతర్గాములు, డ్రోన్లు, యుద్ధ విమానాల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు బడ్జెట్ ఊతమిచ్చినట్లయింది. అటు సాయుధ దళాల్లో చేరే అగ్నివీరులకు పన్నుల నుంచి కాస్త ఉపశమనం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో రక్షణ శాఖ వాటా 13.18%గా ఉంది.
రక్షణ రంగానికి కేటాయింపులిలా..
* 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.5,93,537.64 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తం (రూ.5.25లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 13శాతం అధికం.
* రూ.1.62లక్షల కోట్లను మూలధన వ్యయం కింద కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక ఆయుధ సామగ్రి కొనుగోళ్లకు కేటాయించారు. 2022-23 బడ్జెట్ కేటాయింపుల్లో ఈ పద్దు కింద రూ.1.52 లక్షల కోట్లు ప్రతిపాదించగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.50 లక్షల కోట్లుగా ఉంది.
* రెవెన్యూ వ్యయాల కోసం రూ.2,70,120 కోట్లను కేటాయించారు. 2022-23లో ఈ పద్దు కింద రూ.2,33,000 కోట్లను కేటాయించారు.
* అత్యవసర సమయాల్లో సరిహద్దులకు జవాన్లు, ఆయుధాలను వేగంగా తరలించేందుకు వీలుగా హిమాలయాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. దీని కోసం సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌ఓ)కు ఈ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను కేటాయించారు.
* మూలధన కేటాయింపుల కింద అత్యధికంగా వాయుసేనకు రూ.57,137.09 కోట్లు దక్కాయి. అందులో విమానాలు, ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.15,721 కోట్లను కేటాయించారు. మూలధన కేటాయింపుల కింద నౌకాదళానికి రూ.52,804 కోట్లు, సైన్యానికి రూ.37,241 కోట్లను ప్రత్యేకించారు.
* పెన్షన్ల కోసం రూ.1,38,205 కోట్లను కేటాయించారు. ఈ పద్దును కలుపుకొని మొత్తం రెవెన్యూ వ్యయం రూ.4,22,162 కోట్లుగా ఉంది.
* ‘అగ్నివీర్ కార్పస్ ఫండ్’ నుంచి అగ్నివీరులు పొందే చెల్లింపులకు పన్నుల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
* రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు రూ.23,264 కోట్లు కేటాయించారు.
* ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ పథకం కింద రూ. 28,138 కోట్లు కేటాయింపు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mehul Choksi: మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసులు ఎత్తివేసిన ఇంటర్‌పోల్!
-
India News
Cyber Crime: వామ్మో.. స్కామ్ కాల్స్‌తో 53 బిలియన్ డాలర్లు కొల్లగొట్టారా?
-
World News
Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్