Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పు చేశాం: పార్లమెంటులో పాక్‌ మంత్రి

ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్‌ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.

Updated : 02 Feb 2023 08:29 IST

ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్‌ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.’ అని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు సుమారు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని వాపోయారు. మసీదులో ఆత్మాహుతి దాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన ప్రదర్శన జరిపారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 101 మంది మరణించారు. వారిలో 97 మంది పోలీసులే. పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అసీం మునీర్‌ సోమవారం పెషావర్‌ వెళ్లి పేలుడు స్థలాన్ని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని