పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి

బిహార్‌లోని నలందాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థినులను చూసి పరీక్ష హాల్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు.

Updated : 02 Feb 2023 11:15 IST

నలందా: బిహార్‌లోని నలందాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థినులను చూసి పరీక్ష హాల్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. మనీశ్‌ శంకర్‌(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు.

మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌కు తీసుకొచ్చాడు. బుధవారం షెడ్యూల్‌ ప్రకారం గణిత పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు మనీశ్‌ హాల్‌లోకి వెళ్లాడు. పరీక్ష హాల్‌లో ఉన్న బాలికలను చూసి విద్యార్థి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయాడు. ఒకేసారి అంత మంది విద్యార్థినులను చూడగానే మనీశ్‌ కంగారుపడి స్పృహ తప్పిపోయాడని అతడి మేనత్త వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు