అభివృద్ధి, సమ్మిళితత్వానికి పెద్దపీట

తాజా బడ్జెట్‌లో పర్యాటక రంగానికి సముచిత ప్రాధాన్యం దక్కిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Published : 02 Feb 2023 05:37 IST

పర్యాటక రంగానికి బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యం దక్కింది
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం

దిల్లీ: తాజా బడ్జెట్‌లో పర్యాటక రంగానికి సముచిత ప్రాధాన్యం దక్కిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అమృత కాలంలో పరిణామాత్మక వృద్ధికి అవకాశాలున్న కీలక రంగాల్లో ఒకటిగా పర్యాటకానికి బడ్జెట్‌లో గుర్తింపు దక్కిందని అన్నారు. ‘‘వృద్ధి, అభివృద్ధి, సమ్మిళితత్వానికి పెద్దపీట వేస్తూ అమృత కాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ధన్యవాదాలు. భారత పర్యటక రంగానికి అతిపెద్ద ప్రచారకర్త మోదీయే. ఈ రంగంపై ఆయన ముందుచూపునకు తాజా బడ్జెట్‌ అద్దం పడుతోంది. అమృత కాలంలో మెరుగైన వృద్ధిని సాధించగల పరిణామాత్మక అవకాశాలున్న నాలుగు కీలక రంగాల్లో ఒకటిగా పర్యాటకాన్ని గుర్తించారు. 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్యాకేజీని కేటాయించారు. ‘దేఖో అప్నా దేశ్‌’కు సముచిత ప్రాధాన్యం దక్కింది’’ అని ఆయన ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు