బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీకి రూ.53,000 కోట్లు

ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌.. 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, దేశవ్యాప్తంగా ల్యాండ్‌లైన్‌ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం కోసం రూ.53,000 కోట్లను వినియోగించనున్నామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడించారు.

Updated : 02 Feb 2023 05:52 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌.. 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, దేశవ్యాప్తంగా ల్యాండ్‌లైన్‌ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం కోసం రూ.53,000 కోట్లను వినియోగించనున్నామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడించారు. 2023-24 బడ్జెట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు మూలధన సాయం కింద రూ.52,937 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్రణాళిక కోసం గత ఏడాది ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగానే బడ్జెట్‌లో తాజా కేటాయింపులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు.


కొవిడ్‌ ముందు పరిస్థితికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ

దిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద గ్రామాల్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకుంది. మహమ్మారి సంక్షోభం నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకుని, సాధారణ స్థాయికి చేరుకుందనడానికి ఇదే నిదర్శమని సర్వే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని