కృత్రిమ వజ్రాల ఉత్పత్తి రంగానికి ప్రభుత్వం దన్ను

కృత్రిమ వజ్రాల ఉత్పత్తి (ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌) రంగాన్ని ప్రోత్సహించడానికి వాటి తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Published : 02 Feb 2023 05:37 IST

ముడిపదార్థాలపై పన్ను తగ్గింపు, పరిశోధనలకు ఆర్థికసాయం ప్రకటించిన ఆర్థిక మంత్రి

కృత్రిమ వజ్రాల ఉత్పత్తి (ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌) రంగాన్ని ప్రోత్సహించడానికి వాటి తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలకు గానూ ఐఐటీలకు నిధులను కేటాయిస్తున్నట్లు తన ప్రసంగంలో తెలిపారు. సహజ వజ్రాల లభ్యత క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో.. ప్రయోగశాలల్లో తయారయ్యే ఈ కృత్రిమ వజ్రాలే ఆభరణాల వ్యాపారంలోనూ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వజ్రాలను దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్‌. ఈ దిగుమతి బిల్లు తగ్గించుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

వాటిని ఎలా రూపొందిస్తారంటే..

కృత్రిమ వజ్రాలు దాదాపుగా భూమిలో తయారయ్యే సహజ సిద్ధమైన వజ్రాల్లాగే ఉంటాయి. మోయిసనైట్‌, క్యూబిక్‌ జిర్కోనియా (సీజెడ్‌), వైట్‌ సఫైర్‌, వైఏజీ తదితర పదార్థాలను అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతలకు గురిచేస్తారు. ఈ విధానంలో సహజంగా భూమిలో వజ్రం తయారయ్యే స్థితిని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టిస్తారు. ఫలితంగా చవకయిన కర్బన పదార్థం.. అత్యంత విలువైన వజ్రంగా రూపొందుతుంది. మామూలు వజ్రంలాగే వీటిని సానపడతారు. అయితే సహజమైన వజ్రాలకుండే మెరుపు, మన్నిక వీటికి ఉండవు. ప్రయోగశాలలో తయారు చేస్తారు కాబట్టి అదనపు హంగులను మరింత అద్దుకోవటానికి అవకాశం ఉంది. వీటిని ప్రస్తుతం పరిశ్రమల్లో కట్టర్లుగా, హైపవర్‌ లేజర్‌ డయోడ్లు, హైపవర్‌ ట్రాన్సిస్టర్లల తయారీలోనూ వినియోగిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు